యూఎన్‌ఎస్‌సీలో ఇండియాకు సపోర్ట్‌ చేసినందుకు థ్యాంక్స్‌

యూఎన్‌ఎస్‌సీలో ఇండియాకు సపోర్ట్‌ చేసినందుకు థ్యాంక్స్‌
  • ట్వీట్‌ చేసిన మోడీ

న్యూఢిల్లీ: ఐక్య రాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో ఇండియాకు తాత్కాలిక సభ్య దేశ హోదా లభించేందుకు సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికి ప్రధాని నరేంద్ర మోడీ థ్యాంక్స్‌ చెప్పారు. ఈ మేరకు గురువారం ఉదయం ట్వీట్‌ చేశారు. “ సెక్యూరిటీ కౌన్సిల్‌లో ఇండియా సభ్యత్వం కోసం గ్లోబల్‌ కమ్యూనిటీకి థ్యాంక్స్‌. ప్రపంచ శాంతి, భద్రత స్థితిస్థాపక, ఈక్విటీని ప్రోత్సహించేందుకు ఇండియా అన్ని సభ్య దేశాలతో కలిసి పనిచేస్తుంది” అని మోడీ ట్వీట్‌ చేశారు. ఐక్యరాజ్య సమితిలో బధ్రతా మండలిలో ఇండియా మరోసారి తాత్కాలిక సభ్యత్వాన్ని దక్కించుకుంది. 193 మంది సభ్యుల సర్వసభ్య సమావేశంలో 184 ఓట్లు గెలుచుకున్న భారత్‌ రెండేళ్ల కాలానికి శక్తిమంతమైన యూఎన్‌ఎస్‌సీలో తాత్కాలిక సభ్యత్వం పొందింది.