
పుల్వామా ఉగ్రదాడిపై రివేంజ్ తీర్చుకుంది భారత్ . PoKలో భీకర వైమానిక దాడులు చేసింది. తెల్లవారుజామున మూడున్నర గంటలకు భారత్ మిరేజ్ యుద్ద విమానాలు ఒక్కసారిగా ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడ్డాయి. బాంబుల వర్షం కురిపించాయి. 12 యుద్ధ విమానాల ద్వారా దాదాపు వెయ్యి కేజీల బాంబులను భారత్ ప్రయోగించింది. కార్గిల్ యుద్దం తర్వాత భారత్.. వైమానిక దాడులకు దిగడం ఇదే మొదటిసారి.
గతంలో భారత్ సర్జికల్ దాడులకు దిగినప్పుడు కేవలం పాక్ అక్రమిత కశ్మీర్ లో మాత్రమే దాడులు చేసింది. అయితే ఈసారి మాత్రం PoKను దాటి పాక్ భూభాగంలోకి వెళ్లాయి. అక్కడి కైబర్ ప్రాంతంలోని బాలాకోట్ లో కూడా వైమానిక దాడులు చేశాయి. భారత అధికారులు చెబుతున్న దాని ప్రకారం దాడులు భారీగానే జరిగాయి. అయితే ఇందులో ఎంతమందికి గాయాలయ్యాయి.. ప్రాణనష్టం ఉందా అన్న దానిపై ఇంకా సమాచారం లేదు.
వైమానిక సిబ్బందికి శాల్యూట్ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. మా భూభాగంలోనే మేం దాడులు చేశామంటూ సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు.