కోట్ల ఆస్తిని పోగొట్టుకుని.. అప్పు తీర్చేందుకు కబాబ్‌లు అమ్ముతున్నడు

కోట్ల ఆస్తిని పోగొట్టుకుని.. అప్పు తీర్చేందుకు కబాబ్‌లు అమ్ముతున్నడు

బీజింగ్: అతనో సక్సెస్​ఫుల్ బిజినెస్​మ్యాన్. చిన్న రెస్టారెంట్​తో వ్యాపారం మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదిగాడు. కోట్లకొద్దీ డబ్బు సంపాదించాడు. ఆపై చేసిన ఒక్క ప్రయత్నం అతని జీవితాన్ని తలకిందులు చేసింది. సంపదంతా ఆవిరైంది. రూ.52 కోట్ల అప్పులతో రోడ్డున పడేలా చేసింది. అయినా, అతను ధైర్యం కోల్పోలేదు. మిగిలిన అప్పులు తీర్చేందుకు రోడ్డు పక్కన కబాబ్​లు అమ్మడం స్టార్ట్ చేశాడు. చైనాకు చెందిన తాంగ్జియాంగ్ అనే బిజినెస్​మ్యాన్ స్టోరీ ఇది. రెస్టారెంట్ల సామ్రాజ్యం నిర్మించుకుని, మళ్లీ రోడ్డున పడిన అతని లైఫ్​ జర్నీ ప్రస్తుతం ఆ దేశంలో వైరల్ అవుతోంది.

రెండో బిజినెస్ ఐడియానే బెడిసికొట్టింది..

రెస్టారెంట్​తో వ్యాపారం మొదలు పెట్టిన తాంగ్జియాంగ్ అంచెలంచెలుగా ఎదిగాడు. తన 36 ఏండ్ల వయసునాటికి రెస్టారెంట్లను విస్తరించి మిలియనీర్​గా మారాడు. 2005 లో ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టాడు. అంతే, అతని జీవితం రివర్స్ అయింది. పెట్టుబడికి రెట్టింపు లాస్ వచ్చింది. ఆస్తులన్నీ అమ్మి కట్టినా అప్పు తీరలే. రూ.52 కోట్ల అప్పుతో వీధిన పడ్డాడు. ఇక మిగిలిన అప్పులు ఎలాగైనా తీర్చేందుకు తూర్పు చైనా నగరమైన హాంగ్‌‌జౌలో మళ్లీ చిన్న హోటల్ ప్రారంభించాడు. తానే స్వయంగా కబాబ్​లు కాలుస్తూ అమ్మడం మొదలు పెట్టాడు. అలా వచ్చిన డబ్బుతో అప్పులు కట్టి తన వ్యాపారాన్ని తిరిగి 
నిర్మిస్తానని చెప్తున్నాడు.