మమతా బాటలో కేజ్రీవాల్.. ఒంటరిగానే బరిలోకి

మమతా బాటలో కేజ్రీవాల్.. ఒంటరిగానే బరిలోకి

 పార్లమెంట్ ఎన్నికల ముందు  ఇండియా కూటమికి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఒంటరిగా పోటీ చేసేందుకు  పార్టీలు సిద్ధమవుతున్నాయి. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని మమతా బెనర్జీ ప్రకటించిన కాసేపటికే.. పంజాబ్ లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. 

పంజాబ్ లో కాంగ్రెస్ కు గెలిచే సత్తా లేదన్నారు. కాంగ్రెస్ తో పొత్తు లేదని.. పంజాబ్ లోని అన్ని లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు.  ఆమ్ ఆద్మీ పార్టీ 40 మంది అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసింది.. అభ్యర్థులను ఖరారు చేసే ముందు తాము సర్వే చేయబోతున్నామని చెప్పారు భగవంత్ మాన్.  కూటమిలోని పార్టీల నిర్ణయంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో  సీట్ల పంపకాల్లో   కాంగ్రెస్ కు రెండు సీట్లు కేటాయించాలని టీఎంసీ భావించగా..  కాంగ్రెస్  మాత్రం 10 నుంచి 12 సీట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఒంటరిగానే పోటీ చేయాలని టీఎంసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.