
కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుతో రియల్ మనీ గేమ్స్ బ్యాన్ చేయబడ్డాయి. దేశంలో వీటి బ్యాన్ ప్రస్తుతం ఉన్న అనేక గేమింక్ కంపెనీలను ఆదాయాల తగ్గుదలకు గురిచేస్తుందని నిపుణులు చెప్పారు. అయితే అసలు ఆట ఇప్పుడే స్టార్ట్ అవుతుందని.. ఈ సంస్థలు కొనసాగటానికి విదేశాల్లో విస్తరణకు అక్కడి సంస్థలను కొనుగోలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. విదేశీ మార్కెట్లలో ఉన్న అపార వ్యాపార అవకాశాలపై ఇండియన్ గేమింగ్ సంస్థలు ఫోకస్ పెట్టడానికి ఇదొక అవకాశంగా మారింది. భవిష్యత్తులో భారత్ కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా గేమింగ్ ఇండస్ట్రీ విస్తరణ కొనసాగవచ్చని జెట్ సింథసిస్ సీఈవో రజన్ నవాని అన్నారు.
డబ్బులు పెట్టి ఆడే గేమ్స్ బ్యాన్ చేయబడినందున చాలా మంది క్యాజువల్ గేమ్స్ వైపు మళ్లే అవకాశం ఉందని రజన్ చెప్పారు. అలాగే ఈస్పోర్ట్స్ కేటగిరీ టిక్కెట్ల విక్రయం ద్వారా మానిటైజేషన్ చేసుకునేందుకు కంపెనీలు ప్రయత్నించొచ్చని తెలుస్తోంది. దీనికి తో డు మర్చండైజ్ అమ్మకాలు, డిజిటల్ ఎంగేజ్మెంట్ ద్వారా సంపాదించే అవకాశం ఉంది. అలాగే అడ్వర్డైజ్మెంట్ల ద్వారా గేమింగ్ సంస్థలు తమ కస్టమర్లకు కంపెనీల యాడ్స్ అందించి కూడా మంచి డబ్బు సంపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇకపై ఎక్కువ మంది క్యాజువల్ గేమ్స్ దిశగా మారే అవకాశం ఉన్నందున దానికి అవసరమైన క్లౌడ్ టెక్నాలజీ, ఇతర సాంకేతికలతను మెరుగుపరచటం కీలకంగా నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఈస్పోర్ట్స్ మార్కెట్ 2024లో 209 మిలియన్ డాలర్లుగా ఉండగా.. అది 2034 నాటికి 1.17 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. అలాగే భారతీయ గేమింగ్ పరిశ్రమ 2027 నాటికి 32వేల కోట్ల రూపాయలకు ఎదగొచ్చని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చట్టపరమైన చర్యల కారణంగా మెుదట్లో యూజర్లు తక్కువగా ఉండటంతో ఆదాయాలు తగ్గినప్పటికీ ఆ తర్వాత మెల్లగా పరిస్థితులు పుంజుకుంటాయని గేమింగ్ నిపుణులు అంటున్నారు. మెుత్తానికి మార్పులు కొత్త ఆటగాళ్లు లేదా యూజర్లకు సేఫ్ గేమింగ్ ఎకోసిస్టం అందేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.