గుడ్ న్యూస్ చెప్పిన ఫోన్ పే.. పిన్ నొక్కకుండానే పేమెంట్ చేయొచ్చు

గుడ్ న్యూస్ చెప్పిన ఫోన్ పే..  పిన్ నొక్కకుండానే పేమెంట్ చేయొచ్చు

దేశంలోనే ప్రసిద్ధ చెల్లింపుల ఫ్లాట్ ఫామ్ అయిన ఫోన్ పే యూజర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రోజుల క్రితమే యూపీఐ లైట్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన పేటీఎం.. ఇప్పుడు ఆ జాబితాలోకి ఫోన్ పే కూడా చేరింది. రూ.200 కంటే తక్కువ లావాదేవీలు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రకటించింది. దేశంలోని అన్ని బ్యాంకులకు ఇది సపోర్ట్ చేస్తుందని తెలిపింది.

యూపీఐ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా యాక్సెక్ అయ్యే ఫోన్ పే.. చిన్న మొత్తంలో లావాదేవీలు చేసే వారి కోసం లైట్ యాప్ ను తీసుకువచ్చింది. మరో ముఖ్య విషయం ఏమిటంటే మామూలుగా ఏవైనా చెల్లింపులు చేయాలంటే పిన్ నంబర్ ఎంటర్ తప్పనిసరిగా ఉండేది. కానీ ఈ ఫోన్ పే లైట్ ద్వారా.. రూ.200కంటే తక్కువ పేమెంట్లకు ఎలాంటి పిన్ లేకుండా లావాదేవీలు జరిపే అవకాశం ఉంటుంది. కాబట్టి చెల్లింపులు ఇక మరింత సులభంగా చేయొచ్చు.

దీన్ని ఎలా వాడాలి

  • ఫోన్ పే యాప్ ఓపెన్ చేయండి
  • హోమ్ స్క్రీన్ పై ఉన్న యూపీఐ లైట్ ను సెలక్ట్ చేసుకోండి
  • నిబంధనలు చదివి, ఓకే చేయండి
  • మీ బ్యాంకు ఖాతా నుంచి యూపీఐ లైట్ కి బదిలీ చేయాల్సిన నగదు మొత్తాన్ని ఎంటర్ చేయండి
  • పిన్ ఎంటర్ చేసి, యూపీఐ లైట్ ను యూజ్ చేసుకోండి.

దీని వల్ల ఫోన్ పే యూజర్స్ ఒకేసారి రూ.2వేల వరకు పేమెంట్ చేసే అవకాశాన్ని పొందవచ్చు. పేమెంట్ డన్ అయ్యాక.. దాన్ని నిర్థారించే ఓ మెసేజ్ కూడా యూజర్స్ ఫోన్ కు వస్తుంది. యూజర్స్ కు యాప్ వినియోగాన్ని సులభతరం చేయడానికి, డిజిటల్ చెల్లింపుల అనుభవాన్ని మరింత మెరుగుపర్చాలనే ఉద్దేశంతో ఈ యూపీఐ లైట్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఫోన్ పే సహ వ్యవస్థాపకుడు, సీటీవో రాహుల్ చారి తెలిపారు.