సౌత్ ఇండస్ట్రీ, బాలీవుడ్ కు ఉన్న తేడాలు ఇవే

సౌత్ ఇండస్ట్రీ, బాలీవుడ్ కు ఉన్న తేడాలు ఇవే

ముంబై: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన పుష్ప మూవీ బంపర్ హిట్ గా నిలిచింది. పాన్ ఇండియా లెవల్ లో మంచి వసూళ్లు సాధించింది. ముఖ్యంగా ఉత్తరాది ఆడియన్స్ ను బన్నీ తన మాస్ యాక్టింగ్ తో బాగా ఆకట్టుకున్నాడు. అందుకే హిందీలో ఈ సినిమా ఓ రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ మూవీపై బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రశంసల వర్షం కురిపించింది. సౌత్ సినిమాల్లో ఇండియన్ కల్చర్ లోతుగా ఇమిడి ఉందన్నారు. బాలీవుడ్ కు, దక్షిణాది చిత్రాలకు మధ్య ఇదే ప్రధాన వ్యత్యాసం అన్నారు.

'సౌత్ హీరోలు, అక్కడి కంటెంట్ అంతగా హిట్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వారు భారతీయ సంస్కృతితో గాఢంగా అనుబంధం కలిగి ఉంటారు. తమ కుటుంబాలను ప్రేమిస్తారు. వారి కుటుంబ బంధాలు సంప్రదాయబద్దంగా ఉంటాయి. వాటిలో పాశ్చాత్య ప్రభావం కనిపించదు. ఇక పని  విషయంలో ప్రొఫెషనలిజంతో నిబద్దతతో ఉంటారు. కాబట్టి బాలీవుడ్ తమను పాడు చేయకుండా, వారి ప్రభావం తమ మీద పడకుండా సౌత్ పరిశ్రమ జాగ్రత్త పడాలి' అని కంగనా పేర్కొంది.