బద్రీనాథ్ లోనూ డబ్బులు కొట్టేశారా..? : విచారణకు ఆదేశించటం వెనక కారణం ఏంటీ..?

బద్రీనాథ్ లోనూ డబ్బులు కొట్టేశారా..? : విచారణకు ఆదేశించటం వెనక కారణం ఏంటీ..?

అయోధ్య రామాలయం చోరీ ఘటన మరువక ముందే మరో  ప్రముఖ ఆలయంలో చోరీ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది.  చార్​ ధామ్​ లలో ఒకటైన బద్రీనాధ్​ఆలయంలో నిధులు దుర్వినియోగం జరిగిందని  సోషల్ మీడియా ప్రచారం జరుగుతుండగా .. ఈ ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న బద్రీనాధ్​, కేదారినాధ్​ ౠలయ కమిటీ విచారణకు ఆదేశించింది. పారదర్శకత కోసమే ఈ కమిటీని వేస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు ఆలయ ఉద్యోగుల వివరణ కోరింది. 

భైరవ సేన అనే సంస్థ.. బద్రీనాథ్​ఆలయంలో చోరీ జరిగిందని ఆరోపించింది. దీనికి బద్రీనాధ్ కేదారీనాధ్​ ఆలయ  కమిటీ చైర్మన్​ పీఏ హస్తం ఉందని ఆరోపించింది. దీంతో   నిక్షక్షపాతంగా విచారణ జరిపేందుకు అంతర్గత కమిటీని  ఏర్పాటు  చేయాలని బీకేటీసీ చైర్మన్​ హేమంత్​ ద్వివేది ఆదేశించారు.  విచారణలో దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

ALSO READ : తక్కువ ఖర్చుతో ప్రకృతి అందాల విందు.. టాప్ 5 వందేభారత్ రూట్లు ఇవే..

ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆలయ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫుటేజ్‌లో స్పష్టమైన ఆధారాలు లభించకపోయినా, వ్యవహారం సున్నితమైనది కావడంతో పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

విచారణ కమిటీ అన్ని ఆధారాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను పరిశీలించి నివేదిక సమర్పించనుంది. విచారణలో అవకతవకలు రుజువైతే, బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చట్టం-1939 ,ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి ప్రకారం చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. అలాగే విచారణ పూర్తయ్యే వరకు ప్రజలు నిరాధార ఆరోపణలు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.