ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో మూవీ

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో మూవీ

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొరటాల శివ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో నటించాల్సి ఉంది ఎన్టీఆర్. కానీ ఈ సినిమా ప్రకటించి ఆరు నెలలు దాటుతున్నా ఇంకా షూటింగ్ మొదలుపెట్టలేదు మేకర్స్. దీంతో అసలు సినిమా ఉంటుందా, ఉండదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అలాంటి వారిని ఉత్సాహపరిచేందుకు ఓ క్రేజీ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ను అందించారు కొరటాల. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్నాయని ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ ఫొటోను కూడా రివీల్ చేశారు. ఇందులో  కొరటాలతో పాటు  సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ సినిమా గురించి చర్చించుకుంటున్నట్టు కనిపిస్తోంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు  ప్రేక్షకులను మెప్పించేలా పవర్ ఫుల్ సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌ను సిద్ధం చేస్తున్నట్టు, దీనిపై ఎంటైర్ యూనిట్ చాలా కాన్ఫిడెంట్‌‌‌‌‌‌‌‌గా ఉందని చెబుతున్నారు.  త్వరలోనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తామన్నారు. ఈ మాసీవ్ ప్యాన్ ఇండియా మూవీకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో మిక్కినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్‌‌‌‌‌‌‌‌తో సహా ఇతర నటీనటుల వివరాలను కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. మరోవైపు రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ‘కాంతార’తో సూపర్ సక్సెస్ అందుకున్న రిషబ్ శెట్టితోనూ ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా రిషబ్‌‌‌‌‌‌‌‌, ఎన్టీఆర్ కలవడంతో ఈ పుకార్లు పుట్టుకొచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో దీనిపై రిషబ్ క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ తనను అభినందించడానికి మాత్రమే కలిశారని, తమ  కాంబోలో ఎలాంటి సినిమా లేదని చెప్పుకొచ్చాడు.  నిజానికి తనకు కూడా ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  వర్క్ చేయాలని ఉందని, కానీ ప్రస్తుతానికైతే ఎలాంటి ఆలోచన లేదన్నాడు.