రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ సంబరాలు

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ సంబరాలు

దసరా పర్వదినం వేళ పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చింది. అందుకే తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ సంబరాలు అంబరాన్ని అంటాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు విజయ దశమి రోజున టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ నిర్ణయం తీసుకోవడంతో నేతలు, కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

పల్లె, పట్టణం అనే తేడా లేకుండా కార్యకర్తలు టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ మొత్తం గులాబీ మయంగా మారిపోయింది.  సీఎం కేసీఆర్ ఫొటోలతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి టపాసులు కాలుస్తూ నృత్యాలు చేశారు. జై కేసీఆర్..జై కేసీఆర్.. దేశ్ కీ నేత అంటూ నినాదాలు చేశారు.