లార్డ్స్ వన్డే తర్వాత క్రికెట్ నుంచి తప్పుకోనున్న జులన్ గోస్వామి

లార్డ్స్ వన్డే తర్వాత క్రికెట్ నుంచి తప్పుకోనున్న జులన్ గోస్వామి

భారత మహిళా జట్టు సీనియర్ ప్లేయర్ జులన్ గోస్వామి క్రికెట్కు గుడ్ బై చెప్పనుంది. 2022 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆటకు దూరంగా ఉంటున్న జులన్ గోస్వామి.. సెప్టెంబర్ లో ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌ తర్వాత జులన్ క్రికెట్కు వీడ్కోలు పలకనుంది. సెప్టెంబర్ 10 నుంచి 24 వరకు టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ టూర్లో భాగంగా భారత మహిళల జట్టు  మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. అయితే సెప్టెంబర్ 24న  లార్డ్స్లో జరిగే వన్డే.. జులన్ గోస్వామికి ఫేర్‌వెల్ మ్యాచ్ కానుంది.

జులన్ కెరీర్..
2002లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జులన్..20 ఏళ్లుగా క్రికెట్‌లో కొనసాగుతోంది. తన కెరీర్‌లో 12 టెస్టులు, 199 వన్డేలు, 68 టీ20 మ్యాచులు ఆడింది. టెస్టుల్లో 44 వికెట్లు పడగొట్టింది. వన్డేల్లో 250 వికెట్లు తీసిన ఏకైక.. మొట్టమొదటి ఉమెన్  బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే 68 టీ20ల్లో 56 వికెట్లు దక్కించుకుంది. మొత్తంగా మూడు ఫార్మాట్లలో 350 వికెట్లు తీసింది. 2018 ఆగస్టులో టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంది.  

ప్లేయర్ కమ్ కోచ్..
వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జులన్ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ టీమ్‌కి బౌలింగ్ కన్సల్టెంట్‌గానూ సేవలు అందిస్తోంది. భారత జట్టుకి ప్లేయర్ కమ్ -కోచ్‌గా ఉన్న జులన్ గోస్వామికి వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో చోటు కల్పించారు. దీంతో 39 ఏళ్ల జులన్.. ఈ సిరీస్ తర్వాత క్రికెట్ నుంచి తప్పుకోనుంది. 

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కి భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, దీప్తి శర్మ, తానియా భాటియా, యషికా భాటియా, పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, రేణుకా ఠాకూర్, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్, హర్లీన్ డియోల్, దయలన్ హేమలత, సిమ్రాన్ దిల్ బహదూర్, జులన్ గోస్వామి, జెమీమా రోడ్రిగ్స్