15 వరకు రాష్ట్రపతి నిలయానికి ఎంట్రీ

15 వరకు రాష్ట్రపతి నిలయానికి ఎంట్రీ

ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 వరకు అనుమతి

కంటోన్మెంట్, వెలుగు : కరోనా కారణంగా రెండేం డ్ల తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సాధా రణ ప్రజల సందర్శనకు ఓపెన్​ చేశారు. ఇది ఈ నెల 15 వరకు కొనసాగనుంది. రాష్ట్రపతి శీతాకాల విడిది​ సందర్భంగా నిలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. 90 ఎకరాల విస్తీర్ణంలో వాటర్​ ఫౌంటేన్​లు, బొటానికల్​గార్డెన్,​ వివిధ రకాల  పండ్లు, పూల మొక్కలు, 116 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. 

నో ఎంట్రీ ఫీ

రాష్ట్రపతి నిలయం సందర్శనకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. ఉచితంగానే అనుమతిస్తున్నారు. 2వ నంబర్​ గేటు వద్ద ఎంట్రీ పాస్​ తీసుకొని సందర్శన ముగిసిన తర్వాత ఆ పాస్​ను తిరిగి అప్పగించాలి. లోపలికి ఎలాంటి  తినుబండారాలకు అనుమతిలేదు. స్కూల్​స్టూడెంట్స్​కు ఒక వాటర్​ బాటిల్​కు పర్మిషన్​ఇస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు అనుమతిస్తున్నారు. 5గంటల వరకు అందరూ బయటకు వెళ్లాల్సి ఉంటుంది. విజిటర్స్​ కోసం రాష్ట్రపతి నిలయం ఆవరణలో క్యాంటీన్​ ఏర్పాటు  చేశారు.