అమెరికా తర్వాత అధిక కరోనా టెస్టులు ఇండియాలోనే: వైట్ హౌస్

అమెరికా తర్వాత అధిక కరోనా టెస్టులు ఇండియాలోనే: వైట్ హౌస్

వాషింగ్టన్: అమెరికా తర్వాత అత్యధిక కరోనా టెస్టులు నిర్వహించింది ఇండియానేనని యూఎస్ అధ్యక్ష నిలయం వైట్ హౌజ్ తెలిపింది. యునైటెడ్ స్టేట్స్‌ ఆఫ్ అమెరికాలో 42 మిలియన్ కరోనా టెస్టులు, ఇండియాలో 12 మిలియన్ వైరస్ టెస్టులు చేశారని వైట్ హౌస్ పేర్కొంది. ‘వైరస్ టెస్టుల విషయానికి వస్తే మేం 42 మిలియన్ టెస్టులు చేశాం. ఇండియా 12 మిలియన్ టెస్టులతో రెండో స్థానంలో ఉంది. టెస్టింగ్‌ విషయానికి వస్తే ప్రపంచంలో మేమే లీడింగ్‌లో ఉన్నాం. కరోనా టెస్టింగ్‌లో వరల్డ్‌లో మిగతా అన్ని దేశాల కంటే మేం చాలా ముందంజలో ఉన్నాం. అత్యధిక వైరస్ టెస్టులు చేశాం’ అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్‌నానీ పేర్కొన్నారు.