ఏజీఆర్ బకాయిలపై సుప్రీంకు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్

ఏజీఆర్ బకాయిలపై సుప్రీంకు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్
  • ఇదివరకే పిటిషన్​ వేసిన వొడాఫోన్​ ఐడియా

న్యూఢిల్లీ:  ఏజీఆర్ బకాయిల విషయంలో వొడాఫోన్ ఐడియా మాదిరే ఎయిర్​టెల్​కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. టెలికాం శాఖ తమ నుంచి రూ.44వేల కోట్ల బకాయిలను వసూలు చేయడానికి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ వ్యతిరేకిస్తోంది. ఇవి తమ మనుగడకు,  టెలికాం రంగం పోటీతత్వానికి ముప్పు కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. బకాయిలను మాఫీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.  

టెలికాం రంగంలో కార్యకలాపాలను కొనసాగించడానికి అవసరమైన నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ విస్తరణకు ఏజీఆర్ బకాయిలు తీవ్రంగా ఆటంకం కలిగిస్తున్నాయని ఎయిర్​టెల్​తోపాటు భారతీ హెక్సాకామ్​ పేర్కొంది. ఏజీఆర్ బకాయిల నుంచి మినహాయింపు ఇవ్వకుంటే భారతి కంపెనీలతోపాటు  మొత్తం టెలికాం రంగం ప్రమాదంలో పడుతుందని తమ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలిపాయి. వొడాఫోన్ ఐడియా కూడా సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్​ వేసింది.