కాకినాడలో ‘ఏజెంట్’ మూవీ ట్రైలర్ లాంచ్

కాకినాడలో ‘ఏజెంట్’ మూవీ ట్రైలర్ లాంచ్

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏజెంట్’. సాక్షి వైద్య హీరోయిన్.  మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏకే ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్, సురేందర్2 సినిమా బ్యానర్స్‌‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 28న విడుదలవుతోంది. ప్రమోషన్స్‌‌లో భాగంగా మంగళవారం సాయంత్రం కాకినాడలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ ‘‘ఏజెంట్’ రెండేళ్ళ జర్నీ.  ఈ జర్నీలో మానసికంగా చాలా మారాను. నాకు సినిమా, అభిమానులు అంటే ఎంత పిచ్చో ఇంకా అర్ధమైంది. సాక్షి వైద్య ఇందులో సర్​ప్రైజ్ ప్యాకేజ్. సినిమా అంటే తనకీ ప్రాణం. హిప్‌‌హాప్ తమిళ బ్యాక్‌‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా వైల్డ్‌‌గా ఉంటుంది. ఈ సినిమా క్రెడిట్‌‌ అంతా సురేందర్‌‌‌‌ రెడ్డికే ఇస్తాను. నన్ను ఇలా ఊహించి చూపించిన ఆయనకు థ్యాంక్స్. ‘ఏజెంట్’ నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఫ్యాన్స్ నాపై ఎంత బరువు పెట్టినా దాన్ని మోస్తాను, మీ కోసం వైల్డ్‌‌గా వస్తూనే ఉంటాను’ అన్నాడు. ‘ఏజెంట్‌‌’తో వైల్డ్ రైడ్‌‌కి రెడీ అవ్వండి’ అంది సాక్షి వైద్య. ‘ఇదొక యాక్షన్ స్పై జానర్.  వెరీ స్పెషల్ మూవీ. ఆరు దేశాల్లో డిఫరెంట్ లొకేషన్స్‌‌లో మంచి యాక్షన్ కొరియోగ్రాఫర్స్, స్టంట్స్‌‌తో చేసిన చిత్రమిది.ఏప్రిల్ 28 ఒక పండుగలా ఉంటుంది’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర.