
ముంబై : ఇండియన్ నేవీలో అగ్నివీర్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఓ యువతి(20) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. చనిపోయిన యువతిని కేరళకు చెందిన అపర్ణా నాయర్‌గా పోలీసులు గుర్తించారు. ఆమె 2 వారాల క్రితమే ముంబైకి వచ్చిందన్నారు. గత15 రోజులుగా హాస్టల్లో ఉంటూ మలాడ్‌లోని అగ్నివీర్ ట్రైనింగ్ పొందుతున్నట్లు వెల్లడించారు. సోమవారం ఉదయం అపర్ణ రూమ్‌మేట్ బయటకు వెళ్లిందని పోలీసులు తెలిపారు. ఆమె తిరిగొచ్చేలోపు అపర్ణ తన గదిలో ఉరివేసుకుందన్నారు. తిరిగి వచ్చిన రూమ్మేట్ ఎన్నిసార్లు తలుపు తట్టినా అపర్ణ తలుపు తీయలేదన్నారు. హాస్టల్ సిబ్బంది వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా అపర్ణ ఉరికి వేళాడుతూ కనిపించింది.