అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌-2020 ఫలితాల విడుదల

అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌-2020 ఫలితాల విడుదల

హైదరాబాద్‌: అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌-2020 ఫలితాల విడుదలయ్యాయి. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన అగ్రిసెట్‌, అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌-2020 ఫలితాలను వైస్‌ ఛాన్సలర్‌ డా.ప్రవీణ్‌రావు శుక్రవారం విడుదల చేశారు. రెండేళ్ల అగ్రికల్చర్‌ డిప్లోమా, మూడేళ్ల అగ్రి ఇంజనీరింగ్‌ డిప్లోమా కోర్సు పూర్తిచేసిన విద్యార్ధులకు బీఎస్సీ(హానర్స్‌), అగ్రికల్చర్‌, బి.టెక్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏటా అగ్రిసెట్‌, అగ్రిఇంజనీరింగ్‌ సెట్‌ను నిర్వహిస్తోంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా అగ్రి డిప్లోమాకోర్సుల విద్యార్ధుల కోసం ఆన్‌లైన్‌లో ప్రదేశ పరీక్షనుగడిచిన మూడేళ్లుగా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది.

వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆన్‌ లైన్‌ లో నిర్వహిస్తున్న ఈ విధానాన్ని దేశంలోని పలు ఇతర విశ్వవిద్యాలయాలు అనుసరిస్తున్నాయి. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్ధులకు మెరిట్‌ ప్రాతిపదికన , ఇతర ప్రభుత్వ రిజర్వేషన్‌ నిబంధనల కనుగుణంగా బీఎస్సీ(హానర్స్‌), అగ్రికల్చర్‌, బిటెక్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌లో ప్రవేశాలుకల్పిస్తామని తెలిపారు.