రూ.50 లక్షలు పెట్టి కొని.. వాడకుండా మూలకు పెట్టిండ్రు

రూ.50 లక్షలు పెట్టి కొని.. వాడకుండా మూలకు పెట్టిండ్రు
  • వృథాగా వ్యవసాయ పనిముట్లు
  • ఎక్కువ రేట్‌ కు కిరాయి తెచ్చుకుంటున్న రైతులు

శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ స్కీమ్‌ అమలు కోసం మూడో ఫేజ్‌ కింద పాపన్నపేట మండలాన్ని సెలెక్ట్‌ చేశారు. ఈ స్కీమ్‌ కింద మండలానికి
రూ. 30 కోట్లు శాంక్షన్ అయ్యాయి. పాపన్నపేట వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన మండలం కావడంతో ఆఫీసర్లు రైతుల సౌకర్యార్థం వివిధ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మండల రైతుల అవసరాలు, అగ్రికల్చర్ ఆఫీసర్ల ప్రపోజల్స్ కు అనుగుణంగా రూ.50 లక్షలతో ఒక ట్రాక్టర్, నాలుగు ప్యాడీ బేలర్స్‌‌‌‌ (గడ్డి కట్టే మిషన్), మూడు ప్యాడీ ట్రాన్స్ ప్లాంటర్స్‌‌‌‌​ (వరి నాటు మిషన్ ), రెండు మేజ్ షెల్స్‌‌‌‌(మక్కల నూర్పిడి మిషన్ ), 8 బుష్ కట్టర్స్‌‌‌‌​ (గడ్డి కోసే మిషన్), నాలుగు సీడ్ కమ్ ​ఫర్టి లైజర్ డ్రిల్స్‌‌‌‌, 10 తైవాన్ స్ప్రేయర్లు కొనుగోలు చేశారు. జూలై నెలలోనే
వాటిని తీసుకొచ్చారు.

వినియోగానికి కమిటీ ఏర్పాటు..

ఈ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ల మెయిం టెనెన్స్ కోసం అగ్రికల్చర్ ఆఫీసర్లు, జిల్లా రైతు బంధు సమన్వయ కమిటీ కలిసి 11 మందితో మండల కమిటీని ఎన్నుకున్నారు. వీరిలో ఒకరిని ప్రెసిడెంట్‌‌‌‌గా, మరొకరిని వైస్ ప్రెసిడెంట్‌‌‌‌గా నియమించారు. ఆ మిషన్లను ఈ కమిటీకి అప్పగించారు. వారు అవసరం ఉన్న రైతులకు కిరాయికి ఇవ్వాలి.దీంతో వచ్చే ఆదాయాన్ని మిషన్ల మెయింటెనెన్స్ , సిబ్బంది జీతాలకు వినియోగించాలి. వానాకాలం సీజన్‌ లో వాడలే.. యితే మిషన్లు కొనడంలో ఉత్సాహం చూపిన ఆఫీసర్లు వాటిని వాడకంలోకి తేవడంపై ఇంట్రస్ట్‌ చూపలేదు. దీంతో వానాకాలం సీజన్‌‌‌‌లో అవి నిరూపయోగంగా ఉండిపోయాయి. రైతులు బయట ఎక్కువ రేట్లకు కిరాయికి తెచ్చుకోవాల్సి వచ్చింది. కమిటీ ఏర్పాటులో కొంత లేటయిందంటున్న ఆఫీసర్లు కోతల టైంలో ఉపయోగానికి వచ్చే గడ్డి కట్టే మిషన్లు, మొక్కజొన్న నూర్పిడి మిషన్లు సైతం వాడలేదు. ఆఫీసర్లు స్పందించి యాసంగి సీజన్‌‌‌‌కైనా వాటిని వినియోగంలోకి తేవాలని రైతులు కోరుతున్నారు.

ఈ సీజన్లో స్టార్ట్ చేస్తం

మెయింటెనెన్స్‌ కోసం కమిటీ ఏర్పాటు చేయడం ఆలస్యం కావడంతో మిషిన్లను వాడలేదు. ఈ సీజన్‌‌‌‌లో తప్పకుండా ప్రారంభిస్తం. రైతులకు అందుబాటులో ఉంచుతాం.
– ప్రతాప్ , అగ్రికల్చర్ ఆఫీసర్​, పాపన్నపేట