
- ఎక్కడా కొరత లేదు.. అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి
హైదారాబాద్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అవసరమైన పత్తి, పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని రైతులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ఈ మేరకు ఏఏ జిల్లాలో ఏఏ విత్తనాలు ఎంత స్టాక్ ఉన్నాయో తెలియజేస్తూ కలెక్టర్లకు బుధవారం లెటర్ రాశారు. ఈ సీజన్ కోసం 1.41 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను, 1.26 కోట్ల పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎక్కడ కూడా విత్తనాలకు ఎలాంటి కొరత లేదన్నారు. అయితే పలు చోట్ల కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, అందుబాటులో ఉన్నటువటి స్టాక్‌ను డీఏవోలు, ఇతర అధికారుల సాయంతో రైతులకు చేరువ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.