తెలంగాణలో పంట నష్టంపై వ్యవసాయ శాఖ సర్వే షురూ

తెలంగాణలో పంట నష్టంపై వ్యవసాయ శాఖ సర్వే షురూ

హైదరాబాద్ వెలుగు:  పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు శనివారం సర్వే మొదలుపెట్టారు. ఇటీవల మూడు, నాలుగు రోజుల పాటు కురిసిన అకాల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి రాష్ట్రంలోని కామారెడ్డి , నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాలను వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించి జరిగిన పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఫీల్డ్ లెవల్ సర్వేను నిర్వహిస్తున్నారు. ఈ నష్టాన్ని లెక్కించి ఎన్నికల తర్వాత రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ అందించాలని నిర్ణయించారు.