సొంత పొలాల్లోనే రైతులను బానిసలుగా మారుస్తున్నారు

సొంత పొలాల్లోనే రైతులను బానిసలుగా మారుస్తున్నారు

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులపై శుక్రవారం దేశవ్యాప్త బంద్‌‌‌కు అఖిల భారత్ రైతు సంఘం పిలుపునిచ్చింది. బంద్ నేపథ్యంలో రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారుల దిగ్బంధం, రైల్ రోకో కార్యక్రమాలతో నిరసనలు తెలియజేస్తున్నారు. రైతుల నిరసనలపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. లోప భూయిష్టమైన జీఎస్టీతో ఎంఎస్‌‌‌ఎంఈలను నాశనం చేసిన సర్కార్ ఇప్పుడు కొత్త వ్యవసాయ బిల్లులతో రైతులను బానిసలుగా మార్చేసిందని రాహుల్ ట్వీట్ చేశారు.

రైతుల నుంచి కనీస మద్దతు ధరను లాగేసుకున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కోసం రైతులను బానిసలను చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు డబ్బులతోపాటు గౌరవం దక్కకుండా చేస్తున్నారని విమర్శించారు. రైతులు వాళ్ల సొంత పొలాల్లో బానిసలుగా మారిపోతారని, బీజేపీ తీసుకొచ్చిన కొత్త బిల్లులు ఈస్టిండియా కంపెనీని గుర్తు చేస్తున్నాయని వివరించారు.