రైతుల పేరుతో ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయం తగదు

రైతుల పేరుతో ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయం తగదు

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. వాణిజ్య శాఖా సహాయమంత్రి సోమ్ ప్రకాశ్, బీజేపీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైతుల ఆందోళనలపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. రైతులు రెండడుగులు ముందుకేస్తే… ప్రభుత్వం కూడా రెండడుగులు  ముందుకేస్తుందని… అప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు వ్యవసాయ శాఖా సహాయమంత్రి కైలాష్ చౌదరీ. లేకపోతే ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటాయన్నారు. ప్రతిపక్షాలు 60 ఏళ్లపాటు రాజకీయాలు మాత్రమే చేశాయని… ఇప్పుడు కూడా రైతులను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో టచ్ లో ఉన్నామని… తొందరలోనే మీటింగ్ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు కైలాష్ చౌదరీ.