నదిలో దూకి వ్యవసాయాధికారిణి ఆత్మహత్య ?

నదిలో దూకి వ్యవసాయాధికారిణి ఆత్మహత్య ?

నారాయణఖేడ్:  చిన్నపాటి కుటుంబ కలహాలతో క్షణికావేశంలో నదిలోకి దూకి ఓ అధికారిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం సంగారెడ్డి జిల్లాలో  కలకలం రేపింది. స్థానికుల సమాచారం వివరాలు ఇలా ఉన్నాయి. మనూర్ మండలంలోని రాయిపల్లి వంతెన వద్ద సంగారెడ్డి జిల్లా రైతు శిక్షణా  ఏరువాక కేంద్రం వ్యవసాయ అధికారిణి అరుణ(34) నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.

అరుణకు నాలుగేళ్ల క్రితం సంగారెడ్డికి చెందిన శివ శంకర్ తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల భార్యభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు రావడంతో ఇరువురికి కుటుంబ పెద్దలు నచ్చ చెప్పినట్లు తెలిసింది. అయితే గురువారం సంగారెడ్డి నుండి సెలెరియో కారులో వచ్చిన అరుణ తన సెల్ ఫోన్,  పర్సు,  ఇతర వస్తువులను కారులో ఉంచి రాయిపల్లి వంతెన పైనుండి నదిలో దూకుతున్నట్టు సమాచారం ఇచ్చింది. ఏవో అరుణ  ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఫోన్ ద్వారా సమాచారం వచ్చిందని స్థానికులు ధృవీకరించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు.

for more News…

కట్టలుతెంచుకున్న వరి రైతుల ఆగ్రహం.. రోడ్డుపై వరిధాన్యం పోసి నిప్పంటించి నిరసన  

డొంక తిరుగుడు సమాధానం.. కరీంనగర్ జిల్లా కోర్టు ఆగ్రహం

కరోనాపై నిర్లక్ష్యం: హెల్త్ డైరెక్టర్ కు కోర్టు ధిక్కరణ నోటీసు

రుచి వాసన లేకపోతే కరోనా సోకినట్లేనా?