బతికుండగానే చంపేసిన్రు: రైతు బంధుకు దూరమైన అన్నదాత

బతికుండగానే చంపేసిన్రు: రైతు బంధుకు దూరమైన అన్నదాత

ఆసిఫాబాద్ వెలుగు: ఓ రైతు బతికుండగానే చనిపోయాడని అగ్రికల్చర్ ఆఫీసర్లు రికార్డు చేయడంతో రైతుబంధుకు దూరమయ్యాడు. ఏటా రైతు బంధు అందుకుంటున్న రైతు, ఈసారి రాకపోవడంతో ఆఫీసర్లను కలిశాడు. తీరా వాళ్లు చెప్పిన సమాధానం విని నివ్వెరపోయాడు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని గొర్రె గుట్టశివారులో సర్వే నంబర్ 114 లో హైమద్ హుస్సేన్ అనే రైతుకు 7. 030 ఎకరాల( పట్టా పాస్ బుక్ నంబర T16040010009 ) సాగు భూమి ఉంది.

దీనిని హుస్సేన్ తో పాటు ఆయన కొడుకులు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో గత రెండుసార్లు రైతు బంధు కింద పెట్టుబడి సాయం వచ్చింది. ఈసారి రాకపోవడంతో ఏఈఓ లక్ష్మిని కలిశాడు. రికార్డ్ లో హుస్సేన్ చనిపోయాడని ఉందని చెప్పడంతో లీడర్లను కలిసి గోడు వెళ్ల‌ బోసుకున్నారు. కాగా, జరిగిన పొరపాటు వాస్తవమేననీ, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి, రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని ఇన్చార్జి వ్యవసాయ అధికారి రామకృష్ణ చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి