రూ. 14 లక్షలకు అగ్రికల్చర్​ సీటు

రూ. 14 లక్షలకు అగ్రికల్చర్​ సీటు

జయశంకర్​ వర్సిటీలో ఫస్ట్​ టైమ్​

ఈ ఏడాది నుంచే అందుబాటులోకి!

ఎంసెట్​ ర్యాంకుల ద్వారా 75 సీట్ల భర్తీ

ఎన్నారై కోటాలో రూ. 34 లక్షలు..  25 సీట్లు

రాష్ట్రంలోనే తొలిసారిగా… ప్రభుత్వ అగ్రికల్చర్ కాలేజీల్లో ఈ ఏడాది పేమెంట్​ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రొఫెసర్​ జయశంకర్​ అగ్రికల్చర్ యూనివర్శిటీ ఈ విధి విధానాలు రూపొందిస్తుంది. ఎంసెట్ ర్యాంకులతో ఈ సీట్లను భర్తీ చేస్తారు. రాజేంద్రనగర్‌, జగిత్యాల, అశ్వారావుపేటలోని అగ్రికల్చర్ కాలేజీల్లో పేమెంట్​ సీట్లు అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్ కోటా సీట్లలో 40 శాతం సీట్లను ఫార్మర్​ కోటా కింద రైతుల పిల్లలకు కేటాయిస్తారు.

ఎంసెట్ నుంచి మెడిసిన్ వేరుచేసి నీట్ పరీక్ష నిర్వ హిస్తున్నప్పటి నుంచి విద్యార్థులు అటు ఎంబీబీఎస్ కోసం నీట్, ఇటు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు రాష్ర్ట ప్రభుత్వం నిర్వహిం చే ఎంసెట్ రాస్తున్నారు. ఒక వేళ ఎంబీబీఎస్ లో సీటు రాకున్నా అగ్రికల్చర్ లో చేరొచ్చనే అభిప్రాయం ఉండటమే ఇందుకు కారణం. అలాగే రాష్ర్ట విద్యార్థులు ఏటా 10 నుంచి 20 లక్షలు కట్టి తమిళనాడు, కేరళ, మహారాష్ర్ట లోని అగ్రికల్చర్ కాలేజీల్లో చేరుతున్నారని, అక్కడ సౌకర్యాలు అంతగా లేకున్నా ఆకర్షితులవుతున్నారని తొలిసారిగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ) పేమెం ట్ సీట్లు ప్రవేశపెట్టిం ది. మొత్తం 100 పేమెం ట్ సీట్లను సృష్టించారు. అందుకనే నీట్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేం దుకు కౌన్సెలిం గ్ నిర్వహిం చాలని నిర్ణయించింది.

ఎంబీబీఎస్ తర్వాత అగ్రికల్చర్ బీఎస్సీ (ఏజీ బీఎస్సీ) కి భారీ డిమాండ్ ఉంది. మన రాష్ర్టం లో ఉన్న ఆరు అగ్రికల్చర్‌ కాలేజీల్లో మొత్తం 663 ఏజీ బీఎస్సీ సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో 432 సీట్లను ఎంసెట్ ర్యాం కులు, మిగిలిన వాటిని ఐకార్ ఎంట్రన్స్ టెస్ట్, వ్యవసాయ డిప్లొమా లు ఉత్తీర్ణులైన వారికి కేటాయిస్తారు. వందల్లో సీట్లకు వేలల్లో పోటీ పడుతుం డంటంతో ఏ కోర్సులోనైనా ఓపెన్ కేటగిరీ అయితే 2 వేలు, ఎస్సీలకు ఆరువేల లోపు ర్యాం క్ వస్తే సీటు కన్ఫర్మ్​ అని చెప్పవచ్చు.

ఏజీ బీఎస్సీ సీట్లు .. ఎవరికెన్ని?

ఎంసెట్ 432

ఐకార్-ఏఐఈఈఏ 40

పాలిటెక్నిక్ ఉత్తీర్ణులు 65

వ్యవసాయ శాఖ ఉద్యోగులు 22

వర్శిటీ ఉద్యోగులు 4

జనరల్ పేమెం ట్ 75

ఎన్‌ఆర్ఐ 25

మొత్తం_663

పేమెంట్ సీటుకు 14 లక్షలు

ప్రభుత్వ అగ్రికల్చర్ కాలేజీల్లో తొలిసారిగా రాష్ర్ట ప్రభుత్వం పేమెంట్ సీట్లను ప్రవేశపెట్టి పీజును కూడా ఖరారు చేసిం ది. ఎంసెట్ ర్యాం క్ ద్వారానే భర్తీ చేసే ఈ సీట్లలో కన్వీ నర్ కోటా పేమెం ట్ సీటుకు రూ.14 లక్షలుగా నిర్ణయిం చారు. ఏటా 3.50 లక్షల చొప్పున నాలుగు సంవత్సరాల్లో చెల్లిం చాల్సి ఉంటుం ది. ఇక ఎంసెట్ ర్యాం క్ , పరీక్షే అవసరం లేని ఎన్ఆర్ఐ కోటా సీటుకు ఫీజు 34 లక్షలు. రాజేం ద్రనగర్‌, జగిత్యాల, అశ్వారావుపేటలోని అగ్రికల్చర్ కాలేజీల్లో మాత్రమే ఈ పేమెం టు సీట్లు అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్ కోటా సీట్లలో 40 శాతం సీట్లను ఫార్మర్ కోటా కిం ద ఎకరా భూమికి తక్కువ కాకుం డా కలిగిన రైతు కుటుం బాల నుంచి

వచ్చిన విద్యార్థులకు కేటాయిస్తారు. అయితే వారు కనీసం నాలుగు సంవత్సరాలు నాన్ మునిసిపల్ ఏరియా (గ్రామ పంచాయతీ) పరిధిలోని పాఠశాలల్లో మాత్రమే చదివి ఉండాలి.

ఎంసెట్ ద్వారా ఏజీ బీఎస్సీ సీట్లు

పేమెంట్ కాలేజీ ఎంసెట్ సీట్లు రెగ్యులర్ ఎన్నారై

రాజేంద్రనగర్ 152 30 10

జగిత్యాల 57 23 7

అశ్వరావు పేట 57 22 8

పాలెం_55 – –

వరంగల్ 55 – –

సిరిసిల్ల_56 – –

మొత్తం_432 75 25

అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశాల్లో ప్రతి కేటగిరీలో ఫార్మర్ , నాన్ ఫార్మర్ అని రెం డు విధాలుగా సీటు కేటాయిస్తారు. ఉదాహరణకు ఓపెన్ కేటగిరీలో లోకల్ మరియు అన్ రి జర్వ్​డ్ అని రెం డు విభాగాలుం టాయి. వాటిలో ఒక్కోదానిలో తిరిగి ఫార్మర్ , నాన్ ఫార్మర్ అని విభజించి సీటు కేటాయిస్తారు.

2018లో ఓపెన్ కేటగిరీలో లోకల్ విద్యార్థికి నాన్ ఫార్మర్ కోటాలో 1401, ఫార్మర్ కోటాలో 2397 ర్యాం క్ వచ్చిన వారికి బీఎస్సీ అగ్రికల్చర్‌‌లో సీటు వ చ్చింది. ఇదే విషయంలో బీసీ–సి అభ్యర్థికి వరుసగా 4376 మరియు 6633 ర్యాంకులకు సీటు దక్కింది. ఈ నేపథ్యం లో 2018 లో బీవీఎస్సీ అండ్ ఏహెచ్ , బీఎస్సీ అగ్రికల్చర్ , బీఎస్సీ హార్-టి కల్చర్ , బీఎఫ్ ఎస్సీ కోర్సుల్లో సీటు దక్కించు కున్న ఎంసెట్ లాస్ట్​ ర్యాం క్ వివరాలు మీకందిస్తున్నాం.