వరి తెగుళ్లను సమర్థంగా ఎదుర్కొనే మెంటార్‌‌

వరి తెగుళ్లను సమర్థంగా ఎదుర్కొనే మెంటార్‌‌

ఆగ్రో కెమికల్‌‌ కంపెనీ క్రిస్టల్‌‌ క్రాప్‌‌ ప్రొటెక్షన్‌‌ కొత్త ఫంగిసైడ్‌‌ ‘మెంటార్‌‌’ను వరి రైతుల కోసం విడుదల చేసింది.  వరిలో కనిపించే  ఆకు మడత తెగుళ్లు వంటి వాటిని నియంత్రించడంతో పాటుగా వరి  పంటకు అదనపు రక్షణ సైతం అందిస్తుంది.  అధిక దిగుబడిని సైతం ఇస్తుంది. మెంటార్‌‌ను పలు రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయాలలో పరీక్షించారు.

గడిచిన  ఐదు సంవత్సరాల కాలంలో వెయ్యికి పైగా డెమాన్‌‌స్ట్రేషన్‌‌లను ఇచ్చారు. వరిలో సాధారణంగా కనిపించే తెగుళ్లను ఇది సమర్థంగా నియంత్రించింది.  వరి ఎక్కువగా పండించే ఆంధ్రప్రదేశ్‌‌, తెలంగాణ, కర్నాటక, పశ్చిమ బెంగాల్‌‌, పంజాబ్‌‌, హర్యానా లాంటి రాష్ట్రాల్లో  రబీ సీజన్‌‌ నుంచి మెంటార్‌‌ రైతులకు అందుబాటులో ఉంటుంది.