
ఇప్పటికే రెండు సీజన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ‘ఆహా తెలుగు ఇండియన్ ఐడల్’. తాజాగా మూడో సీజన్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. జూన్ 7 నుంచి ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఆహాలో అలరించనుందని ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ ‘గత రెండు సీజన్స్ కంటే మూడో సీజన్‌లో వరల్డ్ వైడ్ మ్యూజిక్ కంటెస్టెంట్స్ వచ్చారు. అందరిలో నుంచి 12 మంది టాప్ సింగర్స్‌ను సెలెక్ట్ చేశాం. నన్ను నమ్మి ఇండియన్ ఐడల్‌లో జడ్జిగా పెట్టిన అరవింద్‌గారికి, ఎంకరేజ్ చేసిన త్రివిక్రమ్‌గారికి థ్యాంక్స్’ అని చెప్పాడు. రెండు సీజన్లను మించి మూడో సీజన్ ఉండబోతోందని హోస్ట్ శ్రీరామ్ చంద్ర అన్నాడు. ఈ సీజన్‌లో ఇంకా మంచి కంటెస్టెంట్స్ వచ్చారని సింగర్ గీతా మాధురి చెప్పింది. సింగర్ కార్తీక్, ప్రీమాంటల్ ఇండియా ఆరాధన, ఆహా సీఈఓ రవికాంత్ తదితరులు కార్యక్రమంలోపాల్గొన్నారు..