145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. రికార్డ్ సృష్టించిన అహ్మదాబాద్ టెస్టు

145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. రికార్డ్ సృష్టించిన అహ్మదాబాద్ టెస్టు

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోన్న నాలుగో టెస్టు మ్యాచ్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ టెస్టు మ్యాచ్ చూసేందుకు లక్షమంది అభిమానులు తరలివచ్చారు. 145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక టెస్టు మ్యాచ్ ను చూసేందుకు ఇంతమంది అభిమానులు రావడం ఇదే తొలిసారి.  ఇప్పటివరకు ఈ రికార్డ్ ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌంగ్ పేరిట ఉంది. 2013, డిసెంబర్ 26న జరిగిన ఆసీస్, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ కు 91,092 మంది అభిమానులు వచ్చారు.