ఈ బ్యూటీ లేడీ.. పెద్ద కిలాడీ.. పక్కాగా ప్లాన్ చేసి ఉద్యోగం చేస్తున్న చోటే..

ఈ బ్యూటీ లేడీ.. పెద్ద కిలాడీ.. పక్కాగా ప్లాన్ చేసి ఉద్యోగం చేస్తున్న చోటే..

అహ్మదాబాద్ సిటీలో ఒక నగల దుకాణంలో పనిచేస్తూ.. ఆ షోరూంలో దొంగతనం చేసిన ఉద్యోగినిని అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె.. కోటీ 66 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. హర్షిదా రాజేంద్రకుమార్ శెట్టి (38) అనే మహిళ.. మే 11న అహ్మదాబాద్‌లోని నికోల్‌లో ఉన్న గ్రావిటీ షాపింగ్ మాల్‌లోని అభూషణ్ జ్యువెలర్స్ నుంచి బంగారు నగలను దొంగిలించి అక్కడి నుంచి పారిపోయింది.

ఆభరణాలు కనిపించడం లేదని.. నికోల్ పోలీస్ స్టేషన్‌లో యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా న్యూ నరోడాలో ఉంటున్న హర్షిదాను అదుపులోకి తీసుకుని విచారించేందుకు.. క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసింది.

పోలీసులు దాదాపు 3 వందల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. ఎట్టకేలకు నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో.. రూ. 22.54 లక్షల విలువైన ఆభరణాలను మాత్రమే ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నగలు ఏం చేసిందనే విషయం విచారణలో తేలనుంది. హర్షిదా.. మయూర్, అశోక్‌ భాయ్ మాలి అనే మరో ఇద్దరితో కలిసి పక్కా స్కెచ్తో ఈ దొంగతనం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఉద్యోగిని తన షిఫ్ట్‌లో పనిచేస్తూ.. ఎవరూ ఆమెను గమనించని సమయంలో దొంగతనం చేసింది.

►ALSO READ | మీ కూతురి డెడ్ బాడీ కుళ్లిపోతుంది.. తీసుకెళ్లండి: ట్విషా శర్మ ఫ్యామిలీకి పోలీసుల లేఖ

షిఫ్ట్ ముగించుకుని.. తనతో పాటు ఈ దొంగతనానికి ప్లాన్ చేసిన వ్యక్తితో కలిసి బైక్‌పై ఉదయ్‌పూర్, జైపూర్ మీదుగా ఢిల్లీకి పారిపోయింది. అయితే.. ఢిల్లీలోని ఒక హోటల్‌లో ఈ కుట్ర ఊహించని మలుపు తిరిగింది. అక్కడ వరకూ ఆమెను తీసుకెళ్లిన ఆమె దొంగతనం పార్టనర్ ఆమెకు కొన్ని నగలు మాత్రమే ఇచ్చి ఎక్కువ నగలను తీసుకుని పారిపోయినట్లు తెలిసింది.

నిందితురాలి నుంచి పోలీసులు నగలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో.. రూ. 9.98 లక్షల విలువైన బంగారు కంకణం, రూ. 1.34 లక్షల విలువైన తెల్లరాళ్లతో పొదిగిన గరుడ చిహ్నం ఉన్న బంగారు ఉంగరం, రూ. 7.43 లక్షల విలువైన బంగారు మంగళసూత్రం, రూ. 3.62 లక్షల విలువైన గోల్డ్ చైన్ ఉన్నాయి. ఆమె దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.