తాజ్ మహల్ ను ఇలా చూడటమే బాగుంది

తాజ్ మహల్ ను ఇలా చూడటమే బాగుంది

జనాలు హైటెక్ టెక్నాలజీ దాటి రోబో ఇంటిలిజెన్సీ  బాట పడుతున్నారు. ఈక్రమంలో రోజుకొక టెక్నాలజీని కనిపెడుతున్నారు.  తాజాగా AIటెక్నాలజీ గురించి ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా చర్చించుకుంటున్నారు.  AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనిషి తన ఊహ ద్వారా దానిని తయారు చేస్తాడు. ఈ టెక్నిక్ సహాయంతో గరీబ్ అంబానీ మరియు ఎలోన్ మస్క్ చిత్రాలు సోషల్ మీడియాలో రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు తాజ్ మహల్ నిర్మాణాన్ని ఈ టెక్నిక్ సహాయంతో చూపించారు. AI కళాకారుడు జియోజాన్ తాజ్ మహల్ నిర్మాణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూపించారు. ఆయన ఫోటోలు షేర్ చేయగానే అది వైరల్ అయ్యాయి.  ఇవి చూసిన తర్వాత  నిర్మిస్తున్న తాజ్‌మహల్‌ని నిర్మిస్తుండగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది.

తాజ్ మహల్ చరిత్రను గుర్తు చేశారు

తాజ్ మహల్ ను ఎలా నిర్మించారో  AI  చూపించింది.   షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించాడు. బిడ్డకు జన్మనిస్తూ ముంతాజ్ మృతి చెందింది. దీని లోపల ముంతాజ్ సమాధి ఉంది. ఈ అందమైన భవనాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు.

 ఏడు చిత్రాలతో తాజ్ మహల్ నిర్మాణం 

కళాకారుడు తాజ్ మహల్ తయారు చేస్తున్నప్పుడు  ఏడు చిత్రాలను రూపొందించాడు. ఇందులో తాజ్ మహల్ చుట్టూ రాడ్లు కనిపిస్తాయి. ఇక్కడ  పలువురు కూలీలు కూడా పని చేస్తున్నారు. తాజ్ మహల్ తయారీ పని 1632లో ప్రారంభమైంది. దీన్ని తయారు చేయడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది. దీని తయారీలో నిమగ్నమైన కూలీలందరి చేతులను షాజహాన్ నరికివేసినట్లు సమాచారం.  దీనికి ఎటువంటి ఆధారాలు లేవు కాని ..నేటికీ ఇది నిజమని ప్రజలు నమ్ముతున్నారు.