AI ఎఫెక్ట్: జర్నలిస్టుల స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

AI ఎఫెక్ట్: జర్నలిస్టుల స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Ai ) దెబ్బకు  ఓ పబ్లిషింగ్ దిగ్గజం తన సంస్థను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేకంగా AI తో నడిచే కొత్త ట్రెంట్ న్యూస్ జనరేటర్ గా మారేందుకు ఇప్పుడున్న సంస్థను పూర్తిగా మూసివేసి అదే బ్రాండ్ తో కొత్త సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. 

జర్మన్ పబ్లిషింగ్ హౌజ్ ఆక్సెల్ స్ర్పింగర్ వార్తల అవుట్ లెట్ అప్ డే (UpDay)మీడియా సంస్థను మూసివేస్తున్నట్టు శుక్రవారం (డిసెంబర్ 8) ప్రకటించింది. డిసెంబర్ లోనే అప్ డే ను మూసివేయాలని యోచిస్తోంది. ఆప్ డే ను AI ఆధారిత ట్రెండ్ న్యూస్ జనరేటర్ గా పున ప్రారంభించాలని నిర్ణయించుకుంది. 2024 ఏప్రిల్ లో AI ఆధారిత ట్రెండ్ న్యూస్ ను పునప్రారంభించనుంది. 
అయితే లెట్ అప్ డే మీడియా సంస్థ మూసివేత క్రమంలో ఉద్యోగులను తగ్గిస్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. కంపెనీ ప్రారంభించిన మొత్తం 150 మంది ఉద్యో్గులుండగా ఇప్పుడు 70 మంది మిగిలి ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగుల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది. 
ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ వార్తాపత్రికలన్నీ ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ మీడియాకు మారుతున్న క్రమంలో AI టెక్నాలజీ వినియోగంతో జర్నలిజంలో ఉద్యోగాలపై ప్రభావం చూపుతోంది.