AI మిమ్మల్ని చూస్తోంది.. సీసీ కెమెరాలకు లింక్ చేసిన ఫస్ట్ సిటీ

AI మిమ్మల్ని చూస్తోంది.. సీసీ కెమెరాలకు లింక్ చేసిన ఫస్ట్ సిటీ

గతంలో పెద్దలు రాజు తలుచుకుంటే రత్నాలకు కరువేముంది... వడ్డించే వాడు మనవాడు అయితే చివరి బంతిలో కూర్చున్న పర్వాలేదు అనే సామెతలు వాడేవారు.. కాని ఇప్పుడు టెక్​ నిపుణులు తలుచుకుంటే సాధ్యపడనిది ఏది లేదంటున్నారు. అప్పుడెప్పుడో పనిచేసే రోబోలు.. మొన్న మొన్న  ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్  ఉపయోగించి (AI) టీవీలో AI యాంకర్​  వార్తలు చదివించారు.  ఇప్పుడు  అహ్మదాబాద్​ లో పోలీసుల పని కూడా AI  తో తయారు చేసిన  కృత్రిమ వ్యక్తి చేస్తున్నాడు.. వివరాల్లోకి వెళ్తే..


ట్రాఫిక్​ పోలీసులు ఉన్నారంటే హెల్మెట్​ లేకుండా వెళ్లేవారు తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు.  సిగ్నల్స్​ దగ్గర ఎవరూ లేరుకదా.. జంప్​ చేస్తుంటారు.  సీసీ కెమారాలు ఉంటే సర్వర్​ నుంచి డేటా సేకరించి చలాన్​ పంపిస్తారు.. ఇక అలాంటిదేమీ లేకుండా AI( ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత  నిఘా వ్యవస్థను అహ్మదాబాద్​లో అందుబాటులోకి తెచ్చారు టెక్​ నిపుణులు.. ఇప్పుడు అహ్మదాబాద్​లో ట్రాఫిక్​ ను AI పరిశీలిస్తుంది.  

అహ్మదాబాద్​ లో ని పాల్దీ ప్రాంతం ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కమాండ్ కంట్రోల్ కేంద్రానికి నిలయంగా మారింది. AI( ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత  నిఘా వ్యవస్థను అహ్మదాబాద్​ పోలీసులు  అమల్లోకి తెచ్చారు. అహ్మదాబాద్‌తోపాటు దాని పరిసర ప్రాంతాల్లో 460 చదరపు కిలోమీటర్ల వరకు ఏఐ పరిధిలోకి రానుంది. ఈ ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థ కోసం డ్రోన్స్‌(Drones)ను కూడా ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు ట్రాఫిక్ సిగ్నల్ ప్రాంతాలు, బస్సుల్లో కూడా కెమెరాలను ఏర్పాటు చేశారు. 

అహ్మదాబాద్‌(ahmedabad)లో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ నిఘా వ్యవస్థ  ద్వారా ట్రాఫిక్, భద్రత, పరిశుభ్రతను పర్యవేక్షించడం వంటి అంశాలను మానిటరింగ్ చేయనున్నారు. దీంతోపాటు పోలీసు విభాగంలో కూడా ఉపయోగించనున్నారు.

AI( ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత  నిఘా వ్యవస్థ  ద్వారా ప్రధానంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు....   అక్రమ పార్కింగ్, చెత్త పేరుకుపోవడం ఇతర పౌర సమస్యలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇతర గుర్తించలేని కార్యకలాపాలను మానిటరింగ్ చేయవచ్చు. దీంతోపాటు ఎవరైనా తప్పిపోయిన(missing) వారిని గుర్తించడం, చోరీ వంటి సంఘటలను సులభంగా గుర్తించవచ్చు. ఈ క్రమంలో సమస్యలను సత్వరమే గుర్తించి పరిష్కరించవచ్చు. దీంతోపాటు పౌరులపై కూడా నిఘా ఉన్న కారణంగా వారు అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంది.  మరి మీరు అహ్మదాబాద్​ టూర్​ కు వెళ్తు మరి ట్రాఫిక్​ లో జాగ్రత్త ఉండండి.