
మనం వదిలిన బాణం బూమరాంగ్ మాదిరిగా మనకే గుచ్చుకున్నట్లుంది పరిస్థితి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో. మనిషి సృష్టించిన టెక్నాలజీ మనిషినే మింగే స్థాయికి చేరుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా AI కారణంగా చిన్నా పెద్ద తేడా లేకుండా దాదాపు అన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. వరుస లేఆఫ్స్ చూస్తూ జాబ్ సెక్యూరిటీ లేదనే ఆందోళన అన్ని రంగాల ఎంప్లాయ్స్ లో నెలకొంది.
ఇలాంటి పరిస్థితుల్లో టెక్ గెయింట్స్, ఎక్స్ పర్ట్స్ చేస్తున్న కామెంట్స్ గుబులు పుట్టిస్తున్నాయి. ఫ్యూచర్ లో 20 శాతం, 30 శాతం, 50 శాతం జాబ్స్ AI మూలంగా పోతాయని కొందరు హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే ఏఐ బేస్డ్ కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయని కూడా ఇప్పటి వరకు చెప్పారు. ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉంటుందని చెప్పిన అనలిస్ట్ ల మాటలను కొట్టిపారేస్తున్నారు లూయిస్ విల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్.
2030 నాటికి 99 శాతం జాబ్స్ ను ఏఐ మింగేస్తుందని కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ రోమన్ యాంపోల్స్కీ చెబుతున్నారు. దీనికి ఎలాంటి ఆల్టర్నేటివ్స్ లేవని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు కాస్ట్ తగ్గించి రెవెన్యూ బూస్ట్ చేసుకునే పనిలో ఏఐ ని వినియోగిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ప్రొఫెసర్ చేసిన కామెంట్స్ టెక్ ఇండస్ట్రీతో పాటు అన్ని రంగాల ఉద్యోగులను భాయాందోళనకు గురిచేసే అంశమే.
ప్రొఫెసర్ యాంపోల్స్కీ ప్రకారం.. ఏఐ కారణంగా ఏ ఒక్కరు సేఫ్ గా లేరని తెలుస్తోంది. వచ్చే ఆటోమేషన్ వేవ్ లో కోడర్స్, ప్రాంప్ట్ ఇంజినీర్లతో సహా అన్ని జాబ్స్ రిస్క్ లో పడతయాని ఆయన చెప్పారు. ఏఐ కారణంగా 10 శాతం నిరుద్యోగులు పెరుగుతారనేది కాదని.. అది 99% వరకు ఉంటుందని చెబుతున్నారు.
AGI.. ఏఐకి జేజమ్మ:
The Diary of a CEO పోడ్ కాస్ట్ కార్యక్రమంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2027 నాటికి మనిషిలాంటి కృత్రిమ మేధస్సు (human-like intelligence) లేదా artificial general intelligence (AGI) అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
AGI వచ్చిన తర్వాత లేబర్ మార్కెట్ కుప్పకూలుతుందని అన్నారు. ఏఐ టూల్స్, హ్యూమనాయిడ్ రోబోలు మనుషుల పనులను కబ్జా చేస్తాయని చెప్తున్నారు. అంటే 2030 నాటికి ఇది జరిగిపోతుందని అంటున్నారు.
కేవలం 20 డాలర్లతో ఏఐని సబ్ స్ర్కైబ్ చేసుకుంటే.. మనిషి ఏం చేస్తాడో అది చేసేస్తుంది. మొదట కంప్యూటర్ ఆటోమేషన్ అవుతుంది.. ఆ తర్వాత మరో 5 ఏండ్లలో హ్యూమనాయిడ్ రోబోలు దిగుతాయి. అంటే ఐదేళ్ల తర్వాత శారీరక శ్రమ చేసే కార్మికులకు ఇక పనే ఉండదు అని చెప్పుకొచ్చారు. ఫ్యూచర్ లో దాదాపు అన్ని పనులు ఆటోమేషన్ కు గురవుతాయని.. అప్పుడు ప్లాన్ B అంటూ ఏదీ ఉండదని హెచ్చిరించారు. మళ్లీ జాబ్స్ రీటెయిన్ చేసుకోవడం అసంభవం అని అన్నారు ఈ ప్రొఫెసర్.