జనవరి 25న హైదరాబాద్కు మల్లికార్జున ఖర్గే

జనవరి 25న హైదరాబాద్కు మల్లికార్జున ఖర్గే

జనవరి 25న  తెలంగాణకు  రానున్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే.  హైదరాబాద్ లోని ఎల్బీస్టేడియంలో జరిగేబూత్ కన్వీనర్ల సమావేశానికి హాజరకానున్నారు. పార్లమెంట్ ఎన్నికలే ఎజెండాగా బూత్ కన్వీనర్ల సమావేశం కొనసాగనుంది. బూత్ కన్వీనర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. మెజారిటీ సీట్లలో కాంగ్రెస్ గెలిచే వ్యూహాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మెజారిటీ పార్లమెంట్ సీట్లు కైవసం చేసుకునే దిశగా క్యాడర్ ను సిద్ధం చేస్తోంది పార్టీ.

మరో వైపు ఎల్బీస్టేడియంలో జరిగే బూత్ లెవల్ఏజెంట్స్ మీటింగ్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.   కార్యక్రమంపై  పీసీసీ  వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ తో సమీక్షించారు .  ఈ సందర్భంగా రేవంత్ పలు సూచనలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ లెవెల్ ఎజెంట్స్ క్రియాశీలకంగా పనిచేశారు. రాష్ట్రంలో పార్టీని గెలిపించడంలో కీలక భూమిక పోషించారని తెలిపారు. ఈ  క్రమంలో పార్లమెంటు ఎన్నికలకు అనుసరించాల్సిన విధానాలపై సమావేశంలో ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేసిన బూత్ లెవెల్ ఎజెంట్స్ అందరూ సమావేశానికి హాజరు కావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.