నిజామాబాద్ జిల్లాలో సమర్థులకే డీసీసీ పోస్ట్ : అబ్జర్వర్ రిజ్వాన్ అర్షద్

నిజామాబాద్ జిల్లాలో సమర్థులకే డీసీసీ పోస్ట్ : అబ్జర్వర్ రిజ్వాన్ అర్షద్

నిజామాబాద్​, వెలుగు: కాంగ్రెస్ అంటే సామాజిక బాధ్యతకు కాంగ్రెస్​ ప్రాధాన్యం ఇస్తుందని, డీసీసీ ప్రెసిడెంట్ నియామకానికి ఏఐసీసీ పంపిన అబ్జర్వర్, కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ అన్నారు. సోమవారం నిజామాబాద్​లోని ఓ హోటల్​లో మీడియాతో మాట్లాడారు.  నాయకులు, కార్యకర్తలకు ఆమోదయోగ్యమైన నేతకు డీసీసీ పోస్టు అప్పగిస్తామన్నారు. పదవి కోసం జిల్లాలో చాలా మంది నాయకులు పోటీ పడుతున్నారని, కనీసం ఐదేండ్లు కాంగ్రెస్​తో ఉన్న అనుబంధం ఇతరాత్రా అంశాలను పరిగణనలోకి తీసుకొని హైకమాండ్​కు పేర్లు నివేదిస్తామన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్​ను అధికారంలోకి తేవడంతో పాటు రాష్ట్రంలో రెండోసారి పవర్​లోకి వచ్చేలా డీసీసీ పని చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం సమర్థుడిని ఎంపిక చేస్తామని,అసెంబ్లీ సెగ్మెంట్ వారిగా మీటింగ్ నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్​లో మంత్రులు, లీడర్లు, కార్యకర్తలు అంతా కుటుంబంగా ఉంటామన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు సుదర్శన్​రెడ్డి, డాక్టర్​ భూపతిరెడ్డి. మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అరేపల్లి మోహన్, ఏనుగు రవీందర్​రెడ్డి, కార్పొరేషన్​ చైర్మన్లు మానాల మోహన్​రెడ్డి, తాహెర్​, అగ్రికల్చర్​ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్​ కేశవేణు ఉన్నారు.