మానుకోట డీసీసీకి 20 దరఖాస్తులు : ఏఐసీసీ అబ్జర్వర్లు

మానుకోట డీసీసీకి 20 దరఖాస్తులు : ఏఐసీసీ అబ్జర్వర్లు

మహబూబాబాద్, వెలుగు: మానుకోట డీసీసీ అధ్యక్ష పదవికి 20 దరఖాస్తులు వచ్చినట్లు ఏఐసీసీ అబ్జర్వర్లు తెలిపారు. మంగళవారం ఏఐసీసీ అబ్జర్వర్ డేబాసిస్ పట్నాయక్, పీసీసీ పరిశీలకుడు షాద్​నగర్​ ఎమ్మెల్యే శంకర్, ఎండీ అవేజ్, డోర్నకల్​ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్, మహబూబాబాద్​ఎమ్మెల్యే భూక్యామురళీ నాయక్, ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు భరత్​చందర్​రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సంఘటన సృజన అభియాన్ సమావేశం నిర్వహించారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం అభిప్రాయ సేకరణ చేసి, అధిష్టానానికి పేర్లు పంపిస్తామని, అక్కడే తుది నిర్ణయం జరుగుతుందని అబ్జర్వర్లు పేర్కొన్నారు.