100 రోజుల్లో ఆరు గ్యారంటీలను నెరవేరుస్తం: మల్లికార్జున్ ఖర్గే

100 రోజుల్లో ఆరు గ్యారంటీలను నెరవేరుస్తం: మల్లికార్జున్ ఖర్గే

100 రోజుల్లో ఆరుగ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి  ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ఎల్బీస్టేడియంలో  జరిగిన బూత్ లెవెల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి బూత్ లెవెల్ కార్యకర్తలే బలం.. రాహుల్ తోపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతల కృషితో పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.. ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు ఖర్గే. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం బాగా పనిచేస్తుందన్నారు. త్వరలో రెండు గ్యారంటీలను సీఎం రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. 

కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం విరుచుకుపడ్డారు మల్లికార్జున్ ఖర్గే. మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదని అన్నారు. మోదీ సర్కార్ ప్రకటనలు తప్పా.. పనులు చేయలేదన్నారు. మోదీ పాలనలో ఉద్యోగాలు లేవు.. 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. ధరలు పెరిగిపోయి అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఖర్గే. మోదీ అచ్చే దిన్ కాదు.. జనాలు నానా కష్టాలు పడుతున్నారని అన్నారు.

ప్రజలకు న్యాయం చేసేందుకు రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర చేపట్టారని మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. ఈడీ, సీబీఐ దాడులు చేసే అవకాశం ఉందని.. భయపడేది లేదని.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేతలు, కార్యకర్తలు కష్టపడి కలిసి పనిచేయాలని కోరారు మల్లికార్జున్ ఖర్గే.