
- నన్ను మాణిక్కం ఠాగూర్ అవమానించడం బాధాకరం
- హైకమాండ్ కు ఏలేటి మహేశ్వర్ రెడ్డి 4 పేజీల లేఖ
హైదరాబాద్ : పార్టీలో జరుగుతున్న అన్ని విషయాలు చెప్పినా.. రాష్ట్ర ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ మళ్లీ తనను అవమానించారంటూ కాంగ్రెస్ అధిష్టానానికి ఏఐసీసీ పొగ్రామ్స్ ఇన్ చార్జ్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాలుగు పేజీల లేఖ రాశారు. ఏడాది నుంచి తాను చేసిన కార్యక్రమాల గురించి చెప్పినా.. ఏడాది నుంచి పని చేయడం లేదంటూ అందరి ముందు ఠాగూర్ అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది నుంచి చేసిన పనులను వివరిస్తూ ఏఐసీసీ హైకమాండ్ కు సుదీర్ఘ లేఖ రాశారు.
ఏఐసీసీ పొగ్రామ్స్ ఇన్ చార్జ్ గా తనకు స్వేచ్ఛ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ పొగ్రామ్స్ ను స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చూస్తూ..ప్రెస్ మీట్లు పెడుతున్నారని తెలిపారు. ఠాగూర్ కు అన్ని విషయాలు చెప్పినా.. మళ్లీ తనను అవమానిస్తున్నారని లేఖలో వివరించారు. తాను కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల సైనికుడినంటూ చెప్పుకొచ్చారు.