ప్రకటన చేసి 10 రోజులైనా నోటిఫికేషన్ రాలే

ప్రకటన చేసి 10 రోజులైనా నోటిఫికేషన్ రాలే

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేసి.. 10 రోజులవుతున్నా.. ఒక్క నోటిఫికేషన్ రాలేదన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ప్రశాంత్ కిషోర్ సర్వేలో యువత, నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పడంతోనే ఉద్యోగాల ప్రకటన చేశారన్నారు. కొన్నిటీఎస్పీఎస్సీ ద్వారా.. మరికొన్ని బోర్డుల ద్వారా చేస్తామని సీఎస్ చెప్పడంపై ఆందోళన వ్యక్తం చేశారు. TRS కార్యకర్తలకు ఉద్యోగాలిచ్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ అంతా టీఎస్పీఎస్సీ  ద్వారా పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు దాసోజు శ్రవణ్.