ఐడీఈ బూట్ క్యాంప్ ప్రారంభం

ఐడీఈ బూట్ క్యాంప్ ప్రారంభం

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీ) నేషనల్ ఐడీఈ బూట్‌‌‌‌‌‌‌‌క్యాంప్‌‌‌‌‌‌‌‌ను వర్చువల్‌‌‌‌‌‌‌‌గా ప్రారంభించింది. ఇన్నోవేషన్, డిజైన్‌‌‌‌‌‌‌‌  ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రెన్యూర్షిప్‌‌‌‌‌‌‌‌ (ఐడీఈ)పై 21 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 26 లొకేషన్లలో రెండు రోజుల సామర్థ్యాభివృద్ధి శిబిరం జరిగింది. 

తెలంగాణ రాష్ట్రానికి నోడల్ సెంటర్‌‌‌‌‌‌‌‌గా హైదరాబాద్​లోని వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేసింది. విద్యార్థులు, ఇన్నోవేషన్ అంబాసి డర్లలో సృజనాత్మక నైపుణ్యాలు పెంపొందిం చడం ఈ కార్యక్రమం ఉద్దేశమని ఏఐసీటీ చైర్మన్ ప్రొఫెసర్​సీతారామ్ అన్నారు. 

హెచ్​సీఏహెచ్ జీలో రోబో గైట్ 

వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని హెల్త్ కేర్ ఎట్ హోమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్​సీఏహెచ్)​ పునరావాస కేంద్రంలో జీ గైట్​ అనే అధునాతన రోబో గైట్ ట్రైనర్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1.8 మిలియన్ల కొత్త స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయని తెలిపింది.  జెన్​రోబోటిక్స్  సంస్థ జీ గైట్​ను తయారు చేసింది.  నాడీ వ్యాధుల బాధితులు తిరిగి నడిచేలా చేయడానికి ఇది ఉపయోగపడుతుందని హెచ్​సీఏహెచ్​పేర్కొంది.