V6 News

పాక్ కళాకారులను నిషేధించాలి: AICWA

పాక్ కళాకారులను నిషేధించాలి: AICWA

పాకిస్తాన్ కు చెందిన కళాకారులు, ఆ దేశ ప్రజలతో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ.. ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) ప్రధాని మోడీకి లెటర్ రాసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత  పాకిస్తాన్ తమ దేశంలో భారతీయ చిత్రాల ప్రసారాలను, విడుదలను నిషేధించింది. దీంతో AICWA కూడా పాక్ ఆర్టిస్టులను  ఇండియాలోకి అనుమతించకూడదని  పిఎం మోడీకి ఓ లెటర్ రాసింది. ఆ లేఖలో, “పాకిస్తాన్ కు చెందిన మూవీ మేకర్స్, ఆర్టిస్ట్స్, వాణిజ్య భాగస్వాముల్ని పూర్తిగా నిషేధించాలని, ఆ తర్వాతనే మొత్తం భారత చిత్ర పరిశ్రమ,సినీ కార్మికులు తమ  పనిని తిరిగి ప్రారంభిస్తామని “చెప్పి తమ విధులను శుక్రవారం బహిష్కరించింది.