టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా ప్లేయర్ ఐడెన్ మార్క్రామ్ క్యాచ్ లతో పండగ చేసుకుంటున్నాడు. వికెట్ కీపర్ గా కాకుండా ఫీల్డర్ గా ఒకే టెస్ట్ మ్యాచ్ లో అత్యధిక క్యాచ్ లు అందుకున్న ప్లేయర్ గా మార్క్రామ్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఐదో రోజు ఆటలో భాగంగా ఈ సఫారీ ఓపెనర్ ఈ ఘనతను అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఐదు క్యాచ్ లు అందుకున్న మార్క్రామ్.. రెండో ఇన్నింగ్స్ లో మరో నాలుగు క్యాచ్ లు పట్టాడు. దీంతో 9 క్యాచ్ లతో టీమిండియా మాజీ స్లిప్ ఫీల్డర్ అజింక్య రహానే వరల్డ్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు.
2015లో శ్రీలంకపై గాలే వేదికగా జరిగిన టెస్టులో రహానే రెండు ఇన్నింగ్స్ లో 8 క్యాచ్ లు తీసుకొని ప్రపంచ రికార్డు సృష్టించాడు. తాజాగా మార్క్రామ్ 9 క్యాచ్ లతో ఈ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. హార్మర్ బౌలింగ్ లో సుందర్ క్యాచ్ తీసుకోవడంతో మార్క్రామ్ ఖాతాలో 8 వ క్యాచ్ చేరింది. టీమిండియా ప్రస్తుతానికి కోల్పోయిన 17 వికెట్లలో 9 క్యాచ్ లు మార్క్రామ్ చేతుల్లోకి వెళ్లడం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో జైశ్వాల్, రాహుల్, జడేజా, నితీష్, కుల్దీప్ క్యాచ్ లు అందుకున్న మార్క్రామ్.. రెండో ఇన్నింగ్స్ లో జురెల్, పంత్, సాయి సుదర్శన్, సుందర్ క్యాచ్ లు పట్టాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే రెండో టెస్టులో టీమిండియా ఓటమిని దగ్గరైంది. ఐదో రోజు తొలి సెషన్ లో మూడు వికెట్లు కోల్పోయి డ్రా కోసం పోరాడుతోంది. సఫారీ స్పిన్నర్ హార్మర్ ధాటికి విలవిల్లాడిన భారత జట్టు ఐదో రోజు తొలి సెషన్ తర్వాత సాయి సుదర్శన్, సుందర్ వికెట్ లు కోల్పోయింది. ప్రస్తుతానికి 7 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజ్ లో జడేజా (47), నితీష్ (0) ఉన్నారు. టీమిండియా గెలవాలంటే మరో 419 పరుగులు చేయాలి. రెండు సెషన్ లలో ఈ స్కోర్ కొట్టడం సాధ్యం కాకపోవడంతో ఈ మ్యాచ్ ను డ్రా చేసుకోవడం కోసం కష్టపడుతోంది.
🚨 HISTORY CREATED BY MARKRAM. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 26, 2025
- Aiden Markram now has most catches in a single Test as a fielder. pic.twitter.com/9PAF3N5ISW
