AIIMS బిబినగర్‌లో టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 10వ తరగతి, ఇంటర్ అర్హతతో అవకాశం!

AIIMS బిబినగర్‌లో టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 10వ తరగతి, ఇంటర్ అర్హతతో అవకాశం!

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బీబీనగర్ (ఎయిమ్స్, బీబీనగర్) రీసెర్చ్ ప్రాజెక్టుల  కోసం టెక్నికల్ సపోర్ట్ విభాగంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
 

మొత్తం ఖాళీలు: 4.( ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్–-I 2, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్--–II 2).

విద్యార్హతలు

ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-I:10వ తరగతి + డిప్లొమా (ఎంఎల్​టీ/ డీఎంఎల్​టీ) పూర్తిచేసి ఉండాలి. దీంతోపాటు సంబంధిత సబ్జెక్ట్ లేదా రంగంలో రెండేళ్ల అనుభవం తప్పనిసరి. లేదా  సంబంధిత సబ్జెక్ట్/ ఫీల్డ్​లో మూడేళ్ల గ్రాడ్యుయేట్ డిగ్రీ  కలిగి ఉండాలి. దీంతోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.

ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-II:  సైన్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్+ డిప్లొమా (ఎంఎల్​టీ/ డీఎంఎల్​టీ) పూర్తిచేసి ఉండాలి. దీంతోపాటు సంబంధిత సబ్జెక్ట్ లేదా రంగంలో ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. లేదా సంబంధిత సబ్జెక్ట్/ ఫీల్డ్​లో మూడేళ్ల గ్రాడ్యుయేట్ డిగ్రీ  కలిగి ఉండాలి. దీంతోపాటు సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్–-I పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు. 

ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-–-II  పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఈ–మెయిల్ ద్వారా ([email protected]).

లాస్ట్  డేట్: డిసెంబర్ 11.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్ సైట్ aiimsbibinagar.edu.inను సందర్శించండి.