ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బీబీనగర్ (ఎయిమ్స్, బీబీనగర్) రీసెర్చ్ ప్రాజెక్టుల కోసం టెక్నికల్ సపోర్ట్ విభాగంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 4.( ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్–-I 2, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్--–II 2).
విద్యార్హతలు
ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-I:10వ తరగతి + డిప్లొమా (ఎంఎల్టీ/ డీఎంఎల్టీ) పూర్తిచేసి ఉండాలి. దీంతోపాటు సంబంధిత సబ్జెక్ట్ లేదా రంగంలో రెండేళ్ల అనుభవం తప్పనిసరి. లేదా సంబంధిత సబ్జెక్ట్/ ఫీల్డ్‌లో మూడేళ్ల గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి. దీంతోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-II: సైన్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్+ డిప్లొమా (ఎంఎల్టీ/ డీఎంఎల్టీ) పూర్తిచేసి ఉండాలి. దీంతోపాటు సంబంధిత సబ్జెక్ట్ లేదా రంగంలో ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. లేదా సంబంధిత సబ్జెక్ట్/ ఫీల్డ్‌లో మూడేళ్ల గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి. దీంతోపాటు సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్–-I పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.
ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-–-II పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఈ–మెయిల్ ద్వారా ([email protected]).
లాస్ట్ డేట్: డిసెంబర్ 11.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ aiimsbibinagar.edu.inను సందర్శించండి.
