ఐజాజ్ షేక్‌ను నిర్దోషిగా తేల్చిన ముంబై కోర్టు

ఐజాజ్ షేక్‌ను నిర్దోషిగా తేల్చిన ముంబై కోర్టు

ఇండియన్ ముజాహిదీన్ కార్యకర్త ఐజాజ్ షేక్ ను ముంబై కోర్టు శుక్రవారం నిర్దోషిగా ప్రకటించింది. 2010 లో నిషేధిత సంస్థ తరపున ఇమెయిల్ పంపడం, న్యూఢిల్లీలో ఉగ్ర దాడుల గురించి హెచ్చరించిన కేసులో సరైన ఆధారాలు లేవని కోర్టు ఐజాజ్ ను నిర్దోషిగా తేల్చింది. 2010 అక్టోబర్ 10న యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన BBC న్యూస్ ఛానెల్‌కు IM తీవ్రవాద దాడులకు పాల్పడుతుందని హెచ్చరిస్తూ పంపిన మెయిల్‌కు సంబంధించి కేసు నమోదు చేయబడింది.

2015 ఫిబ్రవరిలో ముంబై క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. గతంలో టెక్ సావీ కంపెనీలో బీపీఓగా పని చేసేవాడు షేక్. ప్రస్తుతం ఐజాజ్ అతను హైదరాబాద్‌ జైలులో ఉన్నాడు. మెయిల్ పంపిన మొబైల్ ట్రేస్ చేసి చూస్తే.. ఐజాజ్ మొబైల్ నుంచి మరొక సిమ్ నుంచి పంపినట్లు, ఫోర్జరీ కేసు కూడా పోలీసులు ఐజాజ్ పై మోపారు.