యూపీ ఎన్నిక‌ల్లో పొత్తుపై ఎంఐఎం కీల‌క ప్ర‌క‌ట‌న‌

యూపీ ఎన్నిక‌ల్లో పొత్తుపై ఎంఐఎం కీల‌క ప్ర‌క‌ట‌న‌

దేశంలోనే అతిపెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఎన్నిక‌లు వ‌చ్చేనెల‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో అన్నిపార్టీ వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ముందుకు వెళ్తున్నాయి. తాజాగా ఏఐఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. యూపీలో బాబూ సింగ్ కుష్వాహ ,  భారత్ ముక్తి మోర్చాతో పొత్తు పెట్టుకున్నట్లు AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. త‌మ కూట‌మి యూపీలో అధికారంలోకి వ‌స్తే.. ఇద్ద‌రు సీఎంలు.. ఒక‌రు ఓబీసీ, మ‌రొక‌రు ద‌ళిత వ‌ర్గం నుంచి ఉంటార‌న్నారు. ముస్లీం వ‌ర్గానికి చెందిన ముగ్గురుని డిప్యూటీ సీఎంలుగా చేస్తాన‌న్నారు అస‌ద్. 

ఈ ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి నుంచి జరగనున్నాయి. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని 403 నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్ర‌మంలో దేశంలో బీహార్, మహారాష్ట్రలలో ఖాతా తెరిచిన హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో కూడా అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ యూపీ ఎన్నికల్లో  ఇటీవ‌లే 9 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను విడుదల చేశారు.