
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా నడుస్తుండగా.. రాష్ట్రంలోని ఒక మునిసిపాలిటీలో మాత్రం ఆ పార్టీ ఆనవాలు కూడా లేకుండా పోయింది. అధికార టీఆర్ఎస్ కానీ, ప్రతిపక్ష కాంగ్రెస్ కానీ ఆ మున్సిపాలిటీలో ఒక్కటంటే ఒక్క వార్డును కూడా గెలుచుకోలేదు. అదే నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీ.
తెలంగాణలో ప్రభంజనం సృష్టిస్తున్న టీఆర్ఎస్ పార్టీ భైంసాలోని ఒక్క వార్డులో బోణీ కొట్టలేకపోయింది. భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం పార్టీ సొంతం చేసుకుంది. భైంసా మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డుల్లో ఎంఐఎం 15 గెలుపొందగా, బీజేపీ 9 స్థానాల్లో విజయం సాధించింది. ఇండిపెండెంట్లు 2 వార్డులను సొంతం చేసుకున్నారు.