బిహార్ ఎన్నికల్లో.. ఎంఐఎం నుంచి మాజీ క్రికెటర్ కైఫ్ పోటీ

బిహార్ ఎన్నికల్లో.. ఎంఐఎం నుంచి మాజీ క్రికెటర్ కైఫ్ పోటీ
  • మొత్తం 25 మందితో తొలి లిస్ట్ 

న్యూఢిల్లీ, వెలుగు: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపింది. ఈ మేరకు 25 మంది అభ్యర్థులతో ఆదివారం తొలి జాబితాను ప్రకటించింది. ఈ లిస్ట్ లో టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కు చోటు దక్కింది. ఎక్స్ లో ఎంఐఎం ఈ జాబితాను పోస్ట్ చేసింది. సివాన్ నుంచి మహ్మద్ కైఫ్, గోపాల్ గంజ్ ఏసీ నుంచి అనాస్ సలామ్, కిషన్ గంజ్ నుంచి అడ్వకేట్ షమ్స్ ఆగాజ్, మధుబని నుంచి రషీద్ ఖలీల్ అన్సారీ, అరారియా నుంచి మహమ్మద్ మంజూర్ ఆలం వంటి వారు పోటీ చేయనున్నారు. 

బిహార్ లో నవంబర్ 6న ఎన్నికలు, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్లను లెక్కించనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సారథ్యంలోని ఇండియా కూటమి ప్రధానంగా తలపడనున్నాయి. అయితే, నామినేషన్ ప్రక్రియ ముగిసేనాటికి ఆర్జేడీ, కాంగ్రెస్ భాగస్వాములుగా ఉన్న మహాకూటమి మొదటి దశకు సీట్ల పంపకాన్ని ఖరారు చేయలేకపోయింది.