మా సపోర్టు ఆయనకే..ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్

మా సపోర్టు ఆయనకే..ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్

హైదరాబాద్: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డికి తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. శనివారం భారత కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ హైదరాబాద్ ఎంపీ ,AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఓ ట్వీట్ చేశారు. 

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.. ఆయన కోరిక మేరకు మద్దతు ఇస్తున్నట్లు ఒవైసీ  X లో పోస్ట్ షేర్ చేశారు. 
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన సుదర్శనరెడ్డితో తాను మాట్లాడానని  ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశానని ఎంఐఎం హైదరాబాద్ ఎంపీగా అసదుద్దీన్ లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఒవైసీ చెప్పారు. 

అనారోగ్య కారణాల వల్ల జగదీప్ ధంఖర్ తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. సెప్టెంబర 9న ఎన్నికలు జరగనున్నాయి.