ఇండిగో ఎయిర్ లైన్స్ సర్వీసులు రద్దుతో దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో గందరగోళం నెలకొంది. దేశంలో డొమెస్టిక్ సర్వీసుల్లో 70 శాతంపైనే ఇండిగో ఎయిర్ లైన్స్ తన సర్వీసులు నడుపుతున్నది. పైలట్స్ టైమింగ్స్ మార్పు, ఇతర విధివిధానాలతో సిబ్బంది కొరతతో ఇండిగో ఎయిర్ లైన్స్ వెయ్యి సర్వీసులను రద్దు చేసింది. ఈ క్రమంలోనే ఇండిగో ఎయిర్ లైన్స్ పైనే ఆధారపడిన విమాన ప్రయాణికులు ఇప్పుడు నానా కష్టాలు, తిప్పలు పడుతున్నారు. ఈ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని మిగతా ఎయిర్ లైన్స్ టికెట్ రేట్లను అమాంతం పెంచేశాయి.
2025, డిసెంబర్ 6వ తేదీన స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్.. కోల్ కతా నుంచి ముంబై టికెట్ ధరను 90 వేల రూపాయలుగా డిసైడ్ చేసింది. ఈ రూట్ లో రెగ్యులర్ టికెట్ ధర 7 వేల రూపాయలుగా ఉంది. ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో 90 వేల రూపాయలకు అమ్ముతున్నది.
ఇక ఎయిర్ ఇండియా ఏమి తక్కువ తినలేదు. ముంబై టూ భువనేశ్వర్ టికెట్ ధరను 84 వేల 485 రూపాయలు వసూలు చేస్తుంది. మామూలు రోజుల్లో ఈ టికెట్ ధర 5 వేల రూపాయలు మాత్రమే. ఇప్పుడు ఏకంగా 84 వేల రూపాయలు వసూలు చేస్తుంది.
►ALSO READ | హౌసింగ్ సొసైటీ పర్మిషన్ కు రూ.8కోట్ల లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన లిక్విడేటర్
ముందస్తు ప్లానింగ్ ఉంటే పర్వాలేదు.. ఎమర్జన్సీగా వెళ్లాలి అనుకునే వాళ్లు చాలా మందినే ఉంటారు. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం.. ఇలా అత్యవసరంగా వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వారి నుంచి భారీగా టికెట్ ధర వసూలు చేస్తున్నాయి మిగతా ఎయిర్ లైన్స్ కంపెనీలు. బస్సు, రైళ్లు, కార్లలో వెళ్లాలంటే ఒక రోజంతా జర్నీకే సరిపోతుంది. ఈ క్రమంలోనే టికెట్ ధర ఎక్కువ అయినా కొంత మంది అధిక ధరకు టికెట్ కొనుగోలు చేస్తున్నారు.
స్సైస్ జెట్, ఎయిర్ ఇండియా భారీ టికెట్ ధరలతో ప్రయాణికులు సైతం షాక్ అవుతున్నారు. కోల్ కతా టూ ముంబై టికెట్ 90 వేల రూపాయలు ఉండగా.. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే లక్ష రూపాయలు టచ్ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు ప్రయాణికులు.
